వివాదంగా దిగ్వేశ్ సింగ్ క్యాచ్‌..ల‌క్నో టార్గెట్ ఎంతంటే

by velandi.Saikiran |

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన కేకేఆర్, 181 పరుగులు సాధించింది.

వివాదంగా దిగ్వేశ్ సింగ్ క్యాచ్‌..ల‌క్నో టార్గెట్ ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: లక్నోతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన కేకేఆర్, 181 పరుగులు సాధించింది. కెప్టెన్ రహానే 41 పరుగులు, వికెట్ కీపర్ రఘువంశీ 45 పరుగులు చేయగా గ్రీన్ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. చివరలో పావెల్ 39 పరుగులతో ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు. దీంతో 181 పరుగులు సాధించింది కేకేఆర్.

వివాదంగా దిగ్వేశ్ క్యాచ్

కేకేఆర్, ల‌క్నో మధ్య జరిగిన మ్యాచ్ లో దిగ్వేశ్ పట్టిన క్యాచ్ ఇప్పుడు వివాదంగా మారింది. ఫిన్ అలెన్‌ కొట్టిన బంతి బౌండరీ వైపు వెళ్టింది. ఇక‌ అక్కడే ఉన్న దిగ్వేశ్ అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. అయితే ఈ క్యాచ్ పట్టే క్రమంలో దిగ్వేశ్, బౌండరీ లైన్ టచ్ చేసినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే దీన్ని మరో యాంగిల్ లో చూడకుండానే అంపైర్ ఔట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. దీనిపై కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story