IPL 2026 : ఉత్కంఠ పోరులో లక్నో విజయం

by Muthe.Rajitha |

IPL 2026 సీజన్లో నేడు KKR, LSG మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచులో లఖ్‌నవూ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2026 : ఉత్కంఠ పోరులో లక్నో విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో నేడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచులో లఖ్‌నవూ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్ 181 పరుగులు సాధించింది. కెప్టెన్ రహానే 41 పరుగులు, వికెట్ కీపర్ రఘువంశీ (45), గ్రీన్ (32), పావెల్ (39) పరుగులు చేసి రాణించారు. ఇక అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ... చివరి వరకూ పోరాడి 3 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది. బదోని(54), ముకుల్ చౌదరీ(54) పరుగులు చేసారు. చివర్లో ముకుల్ ఫోర్లు, సిక్సులతో విరుచుకు పడటంతో LSG విజయం సొంతం చేసుకుంది. దీంతో KKR ఖాతాలో మరో ఓటమి నమోదైంది.

Next Story