రూ.25 కోట్ల ప్లేయర్ గ్రీన్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు

by velandi.Saikiran |

వేలంలో భారీ ధర పలికిన కామెరాన్ గ్రీన్, టోర్నమెంట్లో మాత్రం పెద్దగా రాణించడం లేదు.

రూ.25 కోట్ల ప్లేయర్ గ్రీన్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 మినీ వేలం సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. అతన్ని రూ. 25.20 కోట్లు పెట్టి మరీ, కేకేఆర్ సొంతం చేసుకుంది. వేలంలో భారీ ధర పలికిన కామెరాన్ గ్రీన్, టోర్నమెంట్లో మాత్రం పెద్దగా రాణించడం లేదు. అత్యంత దారుణంగా విఫలమౌతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ ల్లో ఆడే అవకాశం కామెరాన్ గ్రీన్ కు వచ్చింది. అయితే ఈ మూడు ఇన్నింగ్స్ లలో మొత్తం 30 పరుగులు కూడా దాటలేదు.

మొదటి మ్యాచ్ లో 18 పరుగులు చేసిన గ్రీన్, ఆ తర్వాత రెండు, నిన్న పంజాబ్ పైన నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ లో విఫలమవుతున్న గ్రీన్, బౌలింగ్ చేయడం లేదు. గాయం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా బౌలింగ్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చిందట. అందుకే బంతిని అస్సలు ముట్టుకోవడం లేదు కామెరాన్ గ్రీన్. దీంతో గ్రీన్ ను కొనుగోలు చేయడం దండగే, అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కేకేఆర్ ఫ్యాన్స్. రాబోయే మ్యాచ్ లోనైనా కేకేఆర్ గెలవాలంటే గ్రీన్ ఫామ్ లోకి రావడం అని అనివార్యమని విశ్లేషకులు చెబుతున్నారు. మరి గ్రీన్ ఎలా ఆడతాడో చూడాలి.

Next Story