- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు బౌలింగ్ చేసిన కామెరాన్ గ్రీన్
కేకేఆర్, లక్నో మధ్య మ్యాచ్ నేపథ్యంలో ఎట్టకేలకు బౌలింగ్ చేశాడు కామెరాన్ గ్రీన్.

దిశ, వెబ్ డెస్క్: కేకేఆర్ డేంజర్ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ ఎట్టకేలకు బౌలింగ్ చేసి, సత్తా చాటాడు. అంతేకాదు తన తొలి ఓవర్ లోనే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కూడా పడగొట్టాడు. రూ. 25.2 కోట్లు పెట్టి కామెరాన్ గ్రీన్ ను కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ 2026 నేపథ్యంలో చివరి క్షణంలో జట్టులో చేరాడు గ్రీన్. ఈ క్రమంలో మొదటి మూడు మ్యాచులు ఆడిన గ్రీన్, బ్యాటింగ్ చేశాడు కానీ బౌలింగ్ చేయలేదు. దీంతో మాజీ క్రికెటర్లు ఈ అంశంపై చాలా సీరియస్ అయ్యారు. రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే బౌలింగ్ చేయడా ? అంటూ గ్రీన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు.
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే పెదవి విరిచాడు. ఇన్ని వివాదాల నేపథ్యంలో లక్నోతో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేశాడు గ్రీన్. అంతేకాదు తన తొలి ఓవర్ లో పంత్ వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో గ్రీన్ బౌలింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా వెన్నునొప్పి నుంచి కోలుకుంటోన్న గ్రీన్, ఫిట్ నెస్ లేక బౌలింగ్ చేయడం లేదు. ఈ విషయంపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన కూడా చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాల నేపథ్యంలో మొదటి మూడు మ్యాచ్ లలో బ్యాటింగ్ మాత్రమే చేశాడు గ్రీన్. ఏమైందో తెలియదు కానీ లక్నోతో మ్యాచ్ లో బౌలింగ్ కూడా చేసి విమర్శలకు చెక్ పెట్టాడు.






