CSK అభిమానుల‌ను ర్యాగింగ్ చేసిన కావ్య మార‌న్ !

by velandi.Saikiran |

CSK అభిమానుల‌ను ర్యాగింగ్ చేసినట్లు కావ్య మార‌న్ వీడియో వైర‌ల్ గా మారింది.

CSK అభిమానుల‌ను ర్యాగింగ్ చేసిన కావ్య మార‌న్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో చివరి వరకు పోరాడిన హైదరాబాద్, విక్టరీ అందుకుంది. చెన్నై పైన కేవలం 10 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది SRH. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన నేపథ్యంలో SRH ఓనర్ కావ్య మారన్ చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ పైన విజయం సాధించిన అనంతరం ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కావ్య మార‌న్ సెల‌బ్రేష‌న్ వైర‌ల్

అరుస్తూ చప్పట్లు కొడుతూ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో స్టేడియంలోని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ర్యాగింగ్ చేశారు. మా విజయాన్ని చూసి ఇక సైలెంట్ గా ఉండండి.. అంటూ సిగ్నల్స్ కూడా పంపారు. ఈ నేపథ్యంలోనే కావ్య సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకు వెళ్ళింది సన్ రైజర్స్ హైదరాబాద్. రెండు వ‌రుస ఓటముల తర్వాత మళ్లీ వరుసగా రెండు మ్యాచ్ లు గెలవడంతో హైదరాబాద్ జట్టులో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది.

Next Story