బంగ్లాదేశ్ తో వివాదం...ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన జియో

by velandi.Saikiran |

వివాదం కారణంగా బంగ్లాదేశ్ ఐపీఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది జియోస్టార్.

బంగ్లాదేశ్ తో వివాదం...ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన జియో
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో జియోస్టార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ బ్రాడ్ కాస్ట‌ర్ టీ-స్పోర్ట్స్ కు లేఖ‌ కూడా రాసింది జియోస్టార్. మొన్నటి వరకు ఐపీఎల్ పై నిషేధం విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ సర్కార్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ దేశంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఐపీఎల్ ప్రసారాలు ఎప్పటి లాగానే బంగ్లాదేశ్ లో కొనసాగుతాయని అక్కడి అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. ఈ క్రమంలో జియోస్టార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ ప్రసారాలపై జియో స్టార్ట్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ లో ప్రసారాలను కొనసాగించేందుకు వెనకడుగు వేసింది జియోస్టార్. మొన్నటి వరకు బంగ్లాదేశ్ బ్రాడ్ కాస్టర్ అయిన టీ-స్పోర్ట్స్ తో ఉన్న ఒప్పందాన్ని తాజాగా రద్దు చేసుకుని జియోస్టార్. వాస్తవానికి ఈ రెండు సంస్థల మధ్య 2027 వరకు ఒప్పందం ఉంది. కానీ ఒప్పందం ప్రకారం చెల్లింపుల విషయంలో టీ-స్పోర్ట్స్ సంస్థ దారుణంగా విఫలమైనట్టు తెలుస్తోంది. అందుకే టీ-స్పోర్ట్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ లేఖ రాసింది జియోస్టార్. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలు ప్రశ్నార్థకంగా మారాయి.

Next Story