- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ishan Kishan: ఇలా ఆడితే, విరాట్ కోహ్లీని ఆపడం కష్టమే
ఇలా ఆడితే, విరాట్ కోహ్లీని ఆపడం కష్టమే అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇలా ఆడితే, విరాట్ కోహ్లీని ఆపడం కష్టమే అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వెల్లడించారు. బెంగళూరు చేతిలో సన్ రైజర్స్ తొలి మ్యాచ్ ఓడింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 69 పరుగులతో ఇరగదీశాడు. ఈ దెబ్బకు 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ చిత్తుగా ఓడింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్, హైదరాబాద్ ఓటమిపై కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు.
కోహ్లీని ఔట్ చేసి ఉంటే, గెలిచేవాళ్లం
తొలి మ్యాచ్ లో బెంగళూరు బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ముఖ్యంగా ఛేజింగ్ చేసేటప్పుడు విరాట్ కోహ్లీ అస్సలు పట్టు వదలబోడని.. ఇలాంటి ఇన్నింగ్స్ అతను ఎన్నో ఆడాడని గుర్తు చేశారు. అయితే విరాట్ కోహ్లీని త్వరగా ఔట్ చేయాలని చాలా ప్రయత్నం చేశాం.. కానీ అతను మాత్రం అస్సలు చిక్కలేదని వెల్లడించారు ఇషాన్ కిషన్. లేకపోతే, మేమే గెలిచే వాళ్ళం అన్నారు. అయితే ఈ టోర్నమెంటులో విరాట్ కోహ్లీ ఫామ్ ఇలాగే కొనసాగితే అతన్ని ఆపడం ఎవరి తరం కాదన్నారు.
బెంగళూరు మ్యాచ్ లో తమ బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ..బౌలింగ్ లో విఫలమైనట్లు తెలిపారు. తర్వాతి మ్యాచ్ లో వీటన్నిటిని చక్కదిద్దుకొని, కం బ్యాక్ ఇస్తామని ప్రకటించాడు కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్. కాగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 201 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో ఫినిష్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో ఆరు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది బెంగళూరు.






