- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH కెప్టెన్ ఇషాన్ బ్యాట్ పై వివాదం..కాసుల కోసం భారీ స్కెచ్
చాలా కంపెనీలు స్పాన్సర్లుగా ఉంటామని ఇషాన్ కిషన్ కు ఆఫర్లు ఇచ్చాయట.

దిశ, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాట్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ మధ్య శనివారం మ్యాచ్ జరగగా, ఈ సందర్భంగా ఎలాంటి స్పాన్సర్ షిప్ లేని బ్యాట్ ను వాడాడు ఇషాన్ కిషన్. చాలా కంపెనీలు స్పాన్సర్లుగా ఉంటామని ఇషాన్ కిషన్ కు ఆఫర్లు ఇచ్చాయట. కానీ, ఇషాన్ కిషన్ మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఎక్కువ స్థాయిలో స్పాన్సర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడట ఇషాన్.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కావడం, అటు భారత జట్టులో పదిలంగా స్థానాన్ని సంపాదించుకున్న నేపథ్యంలో తన రేంజ్ పెంచుకునేందుకు ఇషాన్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కువ డబ్బులు ఇచ్చిన కంపెనీతో డీలింగ్ కుదుర్చుకునేందుకు, ఓపిక పడుతున్నాడు. తనకు నచ్చిన ఫిగర్ ఓకే అయితే కచ్చితంగా ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్ 2026 టోర్నమెంటులో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది హైదరాబాద్. ఇందులో మూడింటిలో దారుణంగా ఓడిపోగా, కేవలం కేకేఆర్ పైన విజయం సాధించింది.






