- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో వరుసగా రెండో విజయాలతో జోరు మీద ఉన్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు మరోసారి స్లో ఓవర్ నిబంధనను ఉల్లంఘించింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. శుక్రవారం చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సారి కెప్టెన్‌తోపాటు జట్టు మొత్తానికి ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. సారథి శ్రేయస్ అయ్యర్‌కు రూ.24 లక్షల ఫైన్ విధించారు. అలాగే, ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టులోని ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం(ఏది తక్కువ అయితే అది) ఫైన్ పడింది. పంజాబ్ జట్టు మరోసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. భారీ జరిమానాతోపాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మ్యాచ్ నిషేధానికి గురి కావొచ్చు.






