మరికాసేపట్లో ఐపీఎల్ ఫైనల్.. RCB ఫ్యాన్స్ ఏం చేశారంటే?

by Prasad Jukanti |   (  Updated:2026-05-31 10:01:46  IST  )

ఐపీఎల్ సీజన్ 19 గ్రాండ్ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఆర్సీబీ గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరికాసేపట్లో ఐపీఎల్ ఫైనల్.. RCB ఫ్యాన్స్ ఏం చేశారంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ లవర్స్ కు ఫేవరేట్ లీగ్ ఐపీఎల్ (IPL) ముగింపు దశకు చేరుకుంది. క్రికెట్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ 19 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ ఇవాళ సాయంత్రం 7:30లకు మొదలుకాబోతోంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. రెండోసారి టైటిల్ తమ ఖాతాలో వేసుకునేందుకు ఇరు జట్లు పకడ్బందీ వ్యూహాలతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి జట్టును కట్టడి చేసే విషయంలో ఇరు జట్లు ఎవరి ప్రణాళికలు వారు వేసుకోగా ఇక తమ అభిమాన జట్టు గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఆర్సీబీ గెలుపు కోసం పూజలు:

ఐపీఎల్ లీగ్ ప్రారంభం నుంచి ఊరిస్తూ వస్తున్న టైటిల్ కలను గతేడాది సాకారం చేసుకున్న ఆర్సీబీ అదే ఉత్సాహంతో రెండోసారి కప్పుపై కన్నేసింది. వరుసగా రెండో టైటిల్ పట్టేయాలని టీమ్ పట్టుదల ప్రదర్శిస్తుంటే తమ అభిమాన జట్టు గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ పూజలు మొదలు పెట్టేశారు. బెంగళూరులో ఆర్సీబీ పేరుతో అభిమానులు టీమ్ జర్సీని దేవుడి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జట్టు గెలుపు కోరుతూ ప్రసాదం సైతం పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Next Story