IPL విజేత RCB.. వరుసగా రెండోసారి టైటిల్ ను ముద్దాడిన బెంగళూరు

by Muthe.Rajitha |   (  Updated:2026-05-31 18:07:22  IST  )

IPL 2026 సీజన్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) నిలిచింది.

IPL విజేత RCB.. వరుసగా రెండోసారి టైటిల్ ను ముద్దాడిన బెంగళూరు
X

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) నిలిచింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్(GT) ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ ను ముద్దాడింది. తొలుత బ్యాటింగుకు దిగిన గుజరాత్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలం కావడంతో ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే(50) పరుగులు చేసాడు. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు.. స్వల్ప టార్గెట్ ను చేధించేందుకు కష్టపడాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ(75) ఒంటిచేత్తో నిలబెట్టాడు. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది. కాగా RCB కి ఇది వరుసగా రెండవ ట్రోఫీ కావడంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది.

Next Story