- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2026: సొంత మైదానంలో టాస్ ఓడిన హైదరాబాద్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య రసవత్తర పోరు మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య రసవత్తర పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో హోమ్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ, మూడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నిలకడగా కొనసాగుతోంది. సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో మరో విజయంపై కన్నేసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి మూడింట్లో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఢిల్లీ, ఉప్పల్ పిచ్‌పై హైదరాబాద్‌ను కట్టడి చేసేందుకు సిద్ధమైంది.
గెలుపెవరిది...?
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌కు మంచి రికార్డు ఉంది. అయితే ఢిల్లీ బౌలర్లు పవర్‌ప్లేలో ఎంతవరకు ప్రభావం చూపుతారనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. హోమ్ గ్రౌండ్‌లో అభిమానుల కేకల మధ్య హైదరాబాద్ బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారా లేక ఢిల్లీ బౌలింగ్ ధాటికి తలొగ్గుతారా అనేది వేచి చూడాలి.






