కళ్లు చెదిరే ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు దక్కేది ఇంతే!

by Gantepaka Srikanth |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఫైనల్ సమరం జరగనుంది.

కళ్లు చెదిరే ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు దక్కేది ఇంతే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఫైనల్ సమరం జరగనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ ప్రైజ్ మనీ (బహుమతి మొత్తం) వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సీజన్ కోసం బీసీసీఐ మొత్తం 46.5 కోట్ల భారీ ప్రైజ్ మనీ కేటాయించింది. ఫైనల్లో గెలిచి ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడి విజేతగా నిలిచిన జట్టుకు 20 కోట్ల భారీ నగదు బహుమతి లభించనుంది. అలాగే రన్నరప్‌గా నిలిచే (ఫైనల్లో ఓడిన) జట్టుకు 13 కోట్లు దక్కనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ (క్వాలిఫైయర్-2లో ఓడిన జట్టు)కు 7 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎలిమినేటర్లో నిష్క్రమించిన జట్టు): 6.5 కోట్లు లభించనున్నాయి.

వ్యక్తిగత అవార్డుల విజేతలకు బహుమతులు..

టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఇచ్చే అవార్డుల నగదు వివరాల విషయానికొస్తే.. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక రన్స్): 10 లక్షలు. పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు): 10 లక్షలు. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): 10 లక్షలు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: 20 లక్షలు దక్కనున్నాయి.

ప్రస్తుత రేసులో ఉన్నది వీరే..

ప్రస్తుత గణాంకాల ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో 'ఆరెంజ్ క్యాప్' రేసులో ముందుండగా, గుజరాత్ టైటాన్స్ పేసర్ కాగిసో రబాడ 28 ఏకెట్లతో 'పర్పుల్ క్యాప్' రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ (2025 విజేత), అలాగే 2022లో టైటిల్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్.. ఈ ఇరు జట్లలో ఎవరు గెలిచినా ఐపీఎల్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా (CSK, MI. KKRల సరసన) చరిత్ర సృష్టించనున్నారు. రజాత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ, శుభ్ మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఈ ఫైనల్ పోరుపై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచేనాలు నెలకొన్నాయి.

Next Story