జియోస్టార్‌లో ఐపీఎల్ 2026 రికార్డు వ్యూస్.. 1.1 బిలియన్లకు చేరిన ప్రేక్షకాదరణ

by Ramesh Naini |

టాటా ఐపీఎల్ 2026 సీజన్ ప్లే-ఆఫ్స్ దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రేక్షకాదరణ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

జియోస్టార్‌లో ఐపీఎల్ 2026 రికార్డు వ్యూస్.. 1.1 బిలియన్లకు చేరిన ప్రేక్షకాదరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాటా ఐపీఎల్ 2026 సీజన్ ప్లే-ఆఫ్స్ దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రేక్షకాదరణ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సీజన్ అంచనాలకు అందకుండా ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి జియోస్టార్ (JioStar) నెట్‌వర్క్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 1.1 బిలియన్ల వ్యూస్ నమోదైనట్లు సంస్థ వెల్లడించింది.

పెరిగిన టీవీ వ్యూయర్‌షిప్

లీనియర్ టీవీ వీక్షకుల సంఖ్య అత్యంత పటిష్టంగా ఉంటూ, ఏకంగా 500 మిలియన్ల మార్క్‌ను తాకడం గమనార్హం. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వ్యూస్ (రీచ్) 15 శాతం పెరగ్గా, వాచ్-టైమ్ (వీక్షణ సమయం) 7 శాతం వృద్ధి చెందింది. స్మార్ట్ టీవీల్లో మ్యాచ్‌లు చూసే వారి సంఖ్య 25 శాతం పెరిగింది. అలాగే వాచ్-టైమ్‌లో 20 శాతం పెరుగుదల కనిపించింది. ప్రాంతీయ భాషల్లో మ్యాచ్‌లను వీక్షించే వారి వాచ్-టైమ్ అత్యధికంగా 42 శాతం మేర పెరగడం విశేషం. జియోస్టార్ (స్పోర్ట్స్) హెడ్ ఆఫ్ సేల్స్ అనూప్ గోవిందన్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ ఐపీఎల్‌లో అభిమానుల ఆదరణ స్థిరంగా కొనసాగుతోంది. వారానికి వారం పెరుగుతున్న వ్యూయర్‌షిప్.. టోర్నీ అభిమానులకు ఎంతలా చేరువవుతుందో తెలియజేస్తోంది. ప్లే-ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న కొద్దీ ప్రేక్షకులు, వాణిజ్య భాగస్వాములకు జియోస్టార్ అత్యుత్తమ వేదికగా నిలుస్తోంది’ అని తెలిపారు.

Next Story