- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: డికాక్ సూపర్ సెంచరీ.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరుగుల వరద పారించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(112) అద్భుత సెంచరీతో చెలరేగడంతో, నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలంటే ఇప్పుడు 196 పరుగులు చేయాల్సి ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి డికాక్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆది నుంచే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడిన అతను, మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే సెంచరీ మార్కును అందుకుని వాంఖడే ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. నమన్ ధిర్ (50) కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో ముంబై భారీ స్కోరును సాధించగలిగింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యం పంజాబ్ కింగ్స్‌కు సవాల్‌తో కూడుకున్నదే. పంజాబ్ బ్యాటర్లు ఈ భారీ ఛేజింగ్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో సెకండ్ ఇన్నింగ్స్ మరింత ఆసక్తికరంగా మారనుంది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు, జాన్సన్, శషాంక్ తలో వికెట్ తీశారు.






