- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vaibhav Suryavanshi : నడవలేని స్థితిలో వైభవ్ సూర్యవంశీ..
నడవలేని స్థితిలో వైభవ్ సూర్యవంశీ ఉన్న తరుణంలో ఐపీఎల్ నుంచి వైదొలుగుతాడని చర్చ జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో గాయాల బెడద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగారు. ఇక లేటెస్ట్ గా మరో డేంజర్ ఆటగాడు వైభవ్ కు అదే పరిస్థితి ఎదురైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గాయం బారిన పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో వైభవ్ ( Vaibhav Sooryavanshi) నడవలేకపోయాడు. ఈ క్రమంలో అతన్ని మైదానం నుంచి ఇద్దరు తీసుకువెళ్లారు. మంచి ఫామ్ లో ఉన్న వైభవ్ కు తొడ కండరాలు పట్టేయడం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ శిబిరాన్ని కలవరపెడుతోంది.
అయితే నిన్న గాయపడిన వైభవ్ కు ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఒకవేళ గాయం గ్రేడ్ 3 పరిధిలోకి వస్తే కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే, ఐపీఎల్ 2026 నుంచి వైభవ్ తప్పుకోవాల్సి వస్తుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వైభవ్ కు ఎలాంటి సమస్య రాకూడదని కోరుతున్నారు. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు వైభవ్. అయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది.






