మీ పిల్లలను 15 ఏళ్ల వైభవ్‌తో పోల్చకండి !

by velandi.Saikiran |

మీ పిల్లలను 15 ఏళ్ల వైభవ్‌తో పోల్చకండి అంటూ హ‌నుమ విహారి సూచ‌న‌లు చేశారు.

మీ పిల్లలను 15 ఏళ్ల వైభవ్‌తో పోల్చకండి !
X

దిశ‌, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తున్నాడు. సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరన్నది చూడకుండా, ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఊచకోత కోస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. దాదాపు వైభవే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొన్న SRHతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వైభవ్ అద్భుతంగా రాణించాడు. దీంతో దేశ వ్యాప్తంగా వైభవ్ సూర్యవంశీ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ హనుమ విహారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ సాధిస్తున్న విజయాలు అద్భుతమని కొనియాడారు. అయితే ఇతర తల్లిదండ్రులు తమ పిల్లలను.. వైభవ్ సూర్యవంశీతో అస్సలు పోల్చవద్దని కోరారు. ప్రతి ఒక్కరికి ఓ సమయం ఉంటుందని... ఎవరి రేసు వారిదేనని సూచనలు చేశారు. ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రతిభను నమ్ముకుంటే పిల్లలు ఏదో ఒక రోజు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారని విహారి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక విహారి చేసిన కామెంట్స్ పై నెటిజెన్స్ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. క్రికెట్ కామెంట్రీనే కాదు, హితోప‌దేశాలు కూడా చేస్తున్నాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు.


Next Story