- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.100 ఇస్తేనే సెల్పీ ఇస్తా.. వైభవ్ సూర్య వంశీ మరో వీడియో వైరల్
ఐపీఎల్ చిచ్చర పిడిగు వైభవ్ సూర్యవంశీ చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో చక్కర్లు కొడుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026లో (IPL 2026) తన బ్యాటింగ్‌తో రప్పాడిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‍లో మార్మోగిపోతుంది. తనదైన ఆటతీరుతో ఎదురుగా ఉన్నది ఎంతటి అనుభవజ్ఞుడైన బౌలరైనా ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా బాల్స్ ను బౌండరీలు దాటిస్తున్నాడు. మంచి ఊపుతో బెస్ట్ ఫర్మార్మెన్స్ ఇస్తున్న వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు చిన్న నుంచి పెద్దవాలందరూ మంత్రముగ్దులవుతున్నారు. గ్రౌండ్‍లో చిచ్చరపిడుగులా చెలరేగిపోయే ఈ బుడ్డోడు.. గ్రౌండ్ బయట కూడా తన చేష్టలతో అందరికి ఆకర్షిస్తున్నాడు. ఇటీవల సూర్యవంశీ వీడియోలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‍గా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో వీడియో ఇంటర్నెట్‍లో చక్కర్లు కొడుతోంది.
100 ఇస్తేనే సెల్ఫీ అంటూ..
తాజాగా ఓ విమానాశ్రయంలో ఇద్దరు చిన్నారులతో సూర్యవంశీ చేసిన ఫ్రాంక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎయిర్ పోర్టులో కూర్చున్న సూర్యవంశీని చూసిన ఇద్దరు పిల్లలు సెల్ఫీ కోసం దగ్గరకు వచ్చారు. వారి మాటలను విని స్పందించిన వైభవ్.. నాతో ఫోటో తీసుకోవాలనుకుంటే నేను డబ్బులు తీసుకుంటాను. ఒక ఫొటోకు రూ.100 ఇవ్వాలి అంటూ ఆ చిన్నారులకు బదులిచ్చారు. దీంతో మొదట పిల్లలు కొద్దిగా ఆశ్చర్యపోయినా అతను నిజంగానే డబ్బులు అడుగుతున్నాడని భావించి మేము ఇద్దరం ఉన్నామని రూ. 200 ఇస్తాం సర్. మాకు ఫోటో తీయండి ప్లీజ్ అంటూ అమాయకంగా అ గారు. దీంతో ఒక్కసారిగానవ్వేసిన సూర్యవంశీ.. తాను సరదాగా డబ్బులు అడిగానని చెబుతూ వారితో ఫోటోలు దిగి మురిపించారు. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






