చిన్నస్వామిలో 'ఆరెంజ్ ఆర్మీ' ఊచకోత: ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-28 15:57:51  IST  )

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభమే అదిరిపోయింది.

చిన్నస్వామిలో ఆరెంజ్ ఆర్మీ ఊచకోత: ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభమే అదిరిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగినప్పటికీ, హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ తడబడకుండా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోరును నమోదు చేసింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరో కాకుండా, టాపార్డర్ నుండి మిడిలార్డర్ వరకు అందరూ సమిష్టిగా రాణించడం విశేషం. మొత్తంగా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు 201 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), హెన్రిచ్ క్లాసెన్ (31), అనికేత్ వర్మ (43) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ మూడు వికెట్లు, షెఫార్డ్ మూడు వికెట్లు, భూవీ, అభినందన్ సింగ్, సుయాష్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించాలంటే 202 పరుగులు చేయాల్సి ఉంది.

Next Story