దినేష్ కార్తీక్ తో పాండ్యా సీక్రెట్ మీటింగ్..ఆర్సీబీలోకి జంప్ కానున్నాడా ?

by velandi.Saikiran |

దినేష్ కార్తీక్ తో హార్దిక్ పాండ్యా సీక్రెట్ గా మీట్ అయ్యాడు.

దినేష్ కార్తీక్ తో పాండ్యా సీక్రెట్ మీటింగ్..ఆర్సీబీలోకి జంప్ కానున్నాడా ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగిసిన నేపథ్యంలో దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా సీక్రెట్ గా సమావేశమైన ఫోటో వైరల్ గా మారింది. మే 31వ తేదీన ఫైనల్ జరిగింది. ఈ క్రమంలో బెంగుళూరు ఛాంపియన్ గా నిలిచింది. జూన్ 1వ తేదీన అహ్మదాబాద్ లోనే ఉన్న దినేష్ కార్తీక్, రహస్యంగా హార్దిక్ పాండ్యాను కలిశారు. ఈ సమావేశంలో బెంగుళూరు కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ఉన్నారు. దీంతో వీళ్ళ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో వచ్చే సీజన్ లో బెంగళూరు తరఫున హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఐపీఎల్ 2026 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా దారుణంగా విఫలమయ్యాడు పాండ్యా. అటు ముంబై ఇండియన్స్ కూడా తొందరగానే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాపై వేటు వేసేందుకు అంబానీ సిద్ధమయ్యారట. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా బెంగళూరు తో హార్దిక్ పాండ్యా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ లోకి పాండ్యా వెళ్తాడని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బెంగళూరు పేరు తెరపైకి వచ్చింది.

Next Story