- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన రాజస్థాన్..వైభవ్ మళ్లీ ఇరగదీస్తాడా ?
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా మరి కాసేపట్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ముల్లాన్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయనుంది. మొన్న ఎలిమినేటర్ సందర్భంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, భారీ స్కోర్ నమోదు చేసి విజయం సాధించింది. అందుకే అదే సీన్ రిపీట్ అవుతుందన్న కారణంతో, రాజస్థాన్ రాయల్స్ మళ్లీ టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకుంది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ మళ్లీ రెచ్చిపోతాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్ (w), రియాన్ పరాగ్ (c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్(w), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్






