IPL 2026 : సీఎస్కే, జీటీ మ్యాచ్‌కు ఎన్నికల ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

by Harish |

IPL 2026 : సీఎస్కే, జీటీ మ్యాచ్‌కు ఎన్నికల ఎఫెక్ట్..  కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026 షెడ్యూల్‌లో బీసీసీఐ ఓ సవరణ చేసింది. చెన్నయ్ సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ల వేదికలను మార్చింది. ఈ నెల 26న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్నాహ్నం 3:30 గంటలకు సీఎస్కే, జీటీ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ను చెన్నయ్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియానికి షిఫ్ట్ చేశారు. ఈ నెల 26న అహ్మదాబాద్‌తోపాటు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వేదికను మార్చినట్టు ఐపీఎల్ వెల్లడించింది. అలాగే, మే 21న చెన్నయ్‌లో ఈ రెండు జట్లు మరోసారి ఎదురుపడనున్నాయి. తాజా సవరణలో భాగంగా ఆ గేమును అహ్మదాబాద్‌కు మార్చారు. ఇప్పటివరకు లీగ్‌లో ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. జీటీ రెండు విజయాలతో 5వ స్థానంలో ఉంది. సీఎస్కే ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి మూడింట ఓడటంతో 9వ స్థానంలో ఉంది.


Next Story