- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేలిపోయిన గుజరాత్ టైటాన్స్...RCB టార్గెట్ ఎంతంటే
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో ఆర్సీబీ టార్గెట్ ముందు 156 పరుగుల టార్గెట్ ఉంచగలిగారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్స్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు తేలిపోయారు. బెంగళూరు బౌలర్ల దాటికి.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 155 పరుగులు మాత్రమే సాధించింది గుజరాత్ టైటాన్స్. కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కేవలం ఐదో వికెట్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ మాత్రమే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మిగిలిన ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు సాధిస్తే బెంగుళూరు వరుసగా రెండోసారి ఛాంపియన్ గా మారనుంది. స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళాన్ని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. హోమ్ గ్రౌండ్ కనుక గుజరాత్ బౌలర్లు, ఆ చిన్న లక్ష్యాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది. పవర్ ప్లే లోపు కీలక వికెట్లు పడితే.. బెంగళూరు కూడా బయటపడడం కష్టమే.






