పంజాబ్ పై బిగ్ విక్ట‌రీ..సేఫ్ జోన్ లో ఢిల్లీ !

by velandi.Saikiran |   (  Updated:2026-05-11 18:09:39  IST  )

పంజాబ్ పై బిగ్ విక్ట‌రీ సాధించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లే ఆఫ్స్ రేసులోకి వ‌చ్చింది.

పంజాబ్ పై బిగ్ విక్ట‌రీ..సేఫ్ జోన్ లో ఢిల్లీ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ షాక్ ఇచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించి, పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. ధర్మశాల వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పైన ఏకంగా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ. ఈ విజయంతో DC ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇక అటు ఢిల్లీ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్, ఎప్పటిలాగే పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో నిలిచింది.

3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజ‌యం

ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ మధ్య సోమవారం ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్, ఐదు వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఇక ఈ భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు పోరాడి ఛేదించింది. 19 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్ష్యాన్ని ఊది పడేసింది. దీంతో మూడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది.

Next Story