- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CSKకు మరో షాక్.. ఆ స్టార్ ప్లేయర్ దూరం!
కుడి తొడకు గాయం కావడంతో చికిత్స కోసం జేమీ ఓవర్టన్ బ్రిటన్ వెళుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 చివరి దశకు వచ్చిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా, ఇప్పుడు మరో డేంజర్ ఆల్ రౌండర్ జేమీ ఓవర్టన్ దూరమయ్యాడు. కుడి తొడకు గాయం కావడంతో చికిత్స కోసం జేమీ ఓవర్టన్ బ్రిటన్ వెళుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
గాయం కారణంగా కీలక మ్యాచులకు జేమీ ఓవర్టన్ దూరం కాబోతున్నట్లు వెల్లడించింది చెన్నై. ప్లే ఆఫ్స్ రేసు చాలా రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇది చెన్నైకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. ఒకటి ఓడినా ప్లే ఆఫ్స్ చేరుకోవడం సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో గాయాల బెడద చెన్నైని వేధిస్తోంది. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని, ఆయుష్ మాత్రే, ఖలీల్ లాంటి కీలక ప్లేయర్లు జట్టుకు దూరమయ్యారు.






