చిత్తుగా ఓడిన ముంబై.. చెన్నై ఘన విజయం

by Muthe.Rajitha |

IPL 2026లో భాగంగా నేడు MI, CSK మధ్య జరిగిన మ్యాచులో 104 పరుగుల తేడాతో చెన్నై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

చిత్తుగా ఓడిన ముంబై.. చెన్నై ఘన విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : సొంత మైదానం వాంఖడేలో ముంబై చిత్తుగా ఓడింది. IPL 2026లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరిగిన మ్యాచులో 104 పరుగుల తేడాతో చెన్నై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగుకు దిగిన CSK నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. 54 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా ఒంటరిగా చివరి వరకు పోరాడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. అకిల్ 4 వికెట్లు తీసి చెలరేగడంతో 19 ఓవర్లకే 104 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. తిలక్(37), సూర్య కుమార్(36) తప్ప మిగతా ఎవరూ రెండకెల స్కోర్ చేయలేదు. కాగా అనూహ్యంగా పుంజుకొని వరుస 3 విజయాలతో చెన్నై ఏకంగా టాప్ 5 కి చేరుకోగా.. ముంబై 8వ స్థానానికి పడిపోయింది.

Next Story