- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్ కు బిగ్ షాక్...ఉత్కంఠ పోరులో పంజాబ్ విక్టరీ
గుజరాత్ కు బిగ్ షాక్...ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో పంజాబ్ విక్టరీ కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్ లో చివరి వరకు పోరాడి విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్. చండీగఢ్ వేదికగా పంజాబ్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగగా శ్రేయాస్ సేన అద్భుతంగా రాణించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ పైన మూడు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోరాడి మరి గెలిచింది పంజాబ్ కింగ్స్.
పంజాబ్ ను ఆదుకున్న కాన్లీ
ఒకానొక సమయంలో 15 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ శ్రేయాస్ అయ్యర్ కు గాయమైన తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. అక్కడి నుంచి వరుసగా వికెట్ల పతనం మొదలైంది. దీంతో మ్యాచ్ మొత్తం గిల్ సేన చేతిలోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే కాన్లీ 72 పరుగులతో పంజాబ్ కింగ్స్ ను ఆదుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది పంజాబ్. దీంతో ఈ టోర్నమెంట్ లో తొలి విక్టరీ నమోదు చేసుకుంది.






