ప్రచారంలో బ్రేక్.. CSK చూసిన సీఎం స్టాలిన్‌

by velandi.Saikiran |   (  Updated:2026-04-12 02:32:12  IST  )

చెన్నై మ్యాచ్ చూసిన స్టాలిన్ పోస్టు పెట్టారు. హై వోల్టేజ్ ఎన్నిక‌ల ప్రచారంలో ఐపీఎల్ బ్రేక్ అంటూ పోస్ట్ కూడా పెట్టారు.

ప్రచారంలో బ్రేక్.. CSK చూసిన సీఎం స్టాలిన్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా, ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాస్త రిలాక్స్ అయిన స్టాలిన్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చూశారు. చెన్నై వేదికగా CSK, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కారులో వెళుతూ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ మ్యాచ్ లు తన కీ-ప్యాడ్ లో తిలకించారు.

చెన్నై మ్యాచ్ పై సీఎం స్టాలిన్ పోస్ట్

చెన్నై, ఢిల్లీ మ్యాచ్ చూసిన స్టాలిన్ ఆస‌క్తి క‌ర పోస్టు పెట్టారు. హై వోల్టేజ్ ఎన్నిక‌ల ప్రచారంలో ఐపీఎల్ బ్రేక్ అంటూ పోస్ట్ కూడా పెట్టారు. చెన్నై ఆటగాడు సంజు శాంసన్ అదిరిపోయే సెంచరీ చేసినప్పటికీ, తన ఫేవరెట్ క్రికెటర్ ధోనిని మిస్ అవుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు స్టాలిన్. అంతేకాదు, చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా తమిళనాడులో ఈనెల 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అధికారపక్షం డీఎంకె, అన్నా డీఎంకే మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో.. హీరో విజయ్ కూడా ఈ సారి బరిలో ఉన్నాడు. కాగా మే 4వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.


Next Story