IPL 2026: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. చెపాక్‌లో చెన్నై భారీ స్కోరు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-11 15:44:36  IST  )

ఐపీఎల్ 2026లో భాగంగా తన సొంత గడ్డ అయిన ఎంఏ చిదంబరం మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరుగుల విధ్వంసం సృష్టించింది.

IPL 2026: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. చెపాక్‌లో చెన్నై భారీ స్కోరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా తన సొంత గడ్డ అయిన ఎంఏ చిదంబరం మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరుగుల విధ్వంసం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక పోరులో చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ (115) విశ్వరూపం ప్రదర్శించాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్‌లో లేడంటూ వస్తున్న విమర్శలకు సంజూ శాంసన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ, ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ భారీ శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో తన క్లాస్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. సంజూకు తోడుగా యువ బ్యాటర్ ఆయూష్ అద్భుతమైన మద్దతు అందించాడు. సంజూ విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు ఆయూష్ క్లాసీ షాట్లతో అలరిస్తూ కీలకమైన హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి భాగస్వామ్యం చెన్నైకి కొండంత స్కోరును అందించింది. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. చెన్నై బ్యాటర్లు విధించిన ఈ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఛేదిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చెన్నై స్పిన్నర్లను ఎదుర్కొని ఢిల్లీ బ్యాటర్లు ఎంతవరకు నిలబడతారో చూడాలి. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీశారు.

Next Story