- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2026 : చెన్నైకి మూడో ఓటమి
IPL 2026 సీజన్లో భాగంగా నేడు RCB, CSK మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో RCB భారీ విజయాన్ని నమోదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : చెన్నై జట్టు మరో ఘోర ఓటమి పాలైంది. IPL 2026 సీజన్లో భాగంగా నేడు RCB, CSK మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో RCB భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగుకు దిగిన CSK.. నిర్ణీత 20 ఓవర్లకు 251 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. అనంతరం బరిలోకి దిగిన చెన్నై 207 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. సర్ఫరాజ్ 50, ప్రశాంత్ వీర్ 43, ఓవర్టన్ 37 పరుగులు చేసినా లాభం లేకుండా పోయింది. భువనేశ్వర్ 3 కీలక వికెట్లు తీయడంతో CSK తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇక ఈ మ్యాచులో RCB బ్యాటర్ టిమ్ డేవిడ్ 25 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్ల మోత మోగించి 70 పరుగులు చేయడంతో బెంగుళూరు అభిమానులు పండగ చేసుకున్నారు. చివరి ఓవర్లో ఓ బాల్ కు భారీ షాట్ ఆడి బంతిని స్టేడియం బయటికి పంపించాడు. బెంగుళూరు విజయంలో టిమ్ కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.






