Rishabh Pant: పాపం రిష‌బ్ పంత్..ఓపెన‌ర్ గా వ‌చ్చి ర‌నౌట్

by velandi.Saikiran |

తొమ్మిది బంతులు ఎదుర్కొన్న రిష‌బ్ పంత్, ఏడు పరుగులకు రనౌట్ అయ్యాడు.

Rishabh Pant: పాపం రిష‌బ్ పంత్..ఓపెన‌ర్ గా వ‌చ్చి ర‌నౌట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ లోనే పంత్ కు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కాసేపటికి క్రితమే మ్యాచ్ ప్రారంభమైంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగింది ల‌క్నో. అయితే కొత్తగా ఆలోచించిన రిషబ్ పంత్... ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగాడు.

ద‌రిద్రం అంటే రిష‌బ్ పంత్ దే

ఈ సందర్భంగా తొమ్మిది బంతులు ఎదుర్కొన్న రిష‌బ్ పంత్, ఏడు పరుగులకు రనౌట్ అయ్యాడు. మార్ష్ బలంగా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ బంతి బౌలర్ ముఖేష్ చేతులను తగిలి మరోవైపు ఉన్న వికెట్లకు తగిలింది. ఆ సమయంలో క్రీజులో లేని రిషబ్ పంత్ రనౌట్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. పాపం రిష‌బ్ పంత్ కు ఈ సీజన్ కూడా అచ్చిరానట్లే క‌నిపిస్తోందని.. ఇలాంటి రనౌట్ కావడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story