చెన్నైకి ఎదురుదెబ్బ‌..ఆ డేంజ‌ర్ ప్లేయ‌ర్ ఔట్

by velandi.Saikiran |   (  Updated:2026-04-21 13:24:06  IST  )

ఐపీఎల్ 2026లో మిగతా మ్యాచ్ ల‌కు తమ జట్టు ప్లేయ‌ర్ ఆయుష్ మాత్రే దూరమైనట్లు అధికారికంగా ప్రకటన చేసింది CSK యాజమాన్యం.

చెన్నైకి ఎదురుదెబ్బ‌..ఆ డేంజ‌ర్ ప్లేయ‌ర్ ఔట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో పడుతూ లేస్తూ ఆడుతున్న చెన్నైకి సంబంధించిన డేంజర్ ఆటగాడు దూరమయ్యాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో మిగతా మ్యాచ్ ల‌కు తమ జట్టు ప్లేయ‌ర్ ఆయుష్ మాత్రే దూరమైనట్లు అధికారికంగా ప్రకటన చేసింది CSK యాజమాన్యం. నాలుగు రోజుల కిందట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తుండగా ఆయుష్ మాత్రే తొడ కండరాల గాయం బారిన పడ్డాడు.

ఆయుష్ మాత్రే ఔట్..ధోని ఇన్‌

అయితే ఆయుష్ మాత్రే, ఈ గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. అంటే ఈ లెక్కన సీజన్ మొత్తం దూరం కాబోతున్నాడు అన్నమాట. ఇదే విషయాన్ని చెన్నై యాజమాన్యం వెల్లడించింది. కాగా ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకు 6 మ్యాచులు ఆడాడు ఆయుష్ మాత్రే. ఇందులో 201 పరుగులు సాధించి పర్వాలేదనిపించాడు. ఇంత మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ దూరం కావడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కలవరపెడుతోంది. అయితే ఆయుష్ దూరమైనప్పటికీ మహేంద్రసింగ్ నెక్స్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో చెన్నై అభిమానులకు కాస్త ఊరట లభించింది.

Next Story