- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి రెచ్చిపోయిన సమీర్ రిజ్వి..ఢిల్లీ మరో విక్టరీ
ఐపీఎల్ 2026 లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఢిల్లీ, 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే అర్థ సెంచరీ చేయగా రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించాడు. మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేయడంతో ముంబై తక్కువ స్కోరే చేసింది.
ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ ఆటగాడు సమీర్ రిజ్వి మరోసారి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వి 90 పరుగులతో రెచ్చిపోయాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ కూడా జట్టుకు అమూల్యమైన పరుగులు అందించాడు. దీంతో ఆరు వికెట్ల తేడాతో ముంబైపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంలోకి చేరుకుంది.






