రాకా మూవీ.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం, అందరూ శభాష్ అనాల్సిందే !

by velandi.Saikiran |   (  Updated:2026-05-26 15:46:55  IST  )

రాకా మూవీ నేప‌థ్యంలో అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

రాకా మూవీ.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం, అందరూ శభాష్ అనాల్సిందే !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన అల్లు అర్జున్.. ప్రపంచ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్నాడు. పుష్ప సినిమా తర్వాత ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం రాకా మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

ఈ భారీ బడ్జెట్ రాకా మూవీ షూటింగ్ కోసం ప్రైవేట్ జెట్ సౌకర్యాన్ని తిరస్కరించాడట. సాధారణ పౌరుల తరహాలోనే కమర్షియల్ విమానాలలో ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకున్నాడట. వృథా ఖర్చు చేయకుండా, నిర్మాతకు లాభం జరగాలన్న ఒక్క కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాను అట్లీ కుమార్ చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. దీపికా హీరోయిన్ గా మెరువనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుండగా.. సాయి అభ్యంక‌ర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.

Next Story