బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్‌ శర్మ

by velandi.Saikiran |

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని క్రికెటర్ అభిషేక్ శర్మ దర్శించుకున్నారు.

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్‌ శర్మ
X

దిశ‌, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ హైదరాబాద్ గల్లీల్లో మెరిసాడు. ఇవాళ అమీర్ పేట్ సెంటర్ లో షాపింగ్ చేసిన అభిషేక్ శర్మ, ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్లాడు. వైట్ షర్ట్ ధరించిన అభిషేక్ శర్మ, అమీర్ పేట్ సమీపంలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మకు ప్రత్యేక ఆహ్వానం అందించారు ఆలయ అధికారులు. ప్రత్యేక పూజ‌లు చేసిన అనంత‌రం అభిషేక్ కు తీర్థ ప్ర‌సాదాలు అందించారు ఆల‌య పూజారులు. ఇక ఆల‌యంలో అభిషేక్ ను చూసిన భ‌క్తులు, అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

రేపు చెన్నై సూప‌ర్ కింగ్స్ తో మ్యాచ్‌

రేపు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ లో గెలవడం రెండు జట్లకు చాలా కీలకంగా మారింది. పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలంటే ఈ రెండు జట్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నెట్ ప్రాక్టీస్ లో ఇరు జ‌ట్ల ప్లేయర్లు చాలా కష్టపడుతున్నారు.

Next Story