నీ కంటే టెస్ట్ ప్లేయ‌ర్ బెట‌ర్..కోహ్లీపై ఆకాష్ చోప్రా సీరియ‌స్ !

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశారు.

నీ కంటే టెస్ట్ ప్లేయ‌ర్ బెట‌ర్..కోహ్లీపై ఆకాష్ చోప్రా సీరియ‌స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశారు. టీ20లను టెస్టుల తరహాలో ఆడుతున్నాడని మండిపడ్డారు. ఈ నెల 12వ తేదీన ముంబైతో బెంగుళూరు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడినట్లు ఆకాష్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో బెంగళూరు గెలిచినప్పటికీ టీ20 క్రికెట్ కోణం లో చూస్తే, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చాలా స్లోగా ఉందని పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చాలా స్లో..ఆకాశ్ చోప్రా విమర్శలు

అతని స్థాయికి తగ్గట్లుగా ఆడలేదని విమర్శలు చేశారు. ఆయన మైండ్ సెట్ కూడా సరిగా లేనట్లు అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైడ్ బాల్స్ కోసం రెండు రివ్యూలు వృధా చేశాడని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆకాశ్‌ చోప్రా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అయితే ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విరాట్ కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నువ్వే టెస్ట్ ప్లేయర్ అంటూ ఆకాశ్ చోప్రాకు కౌంటర్ ఇస్తున్నారు. భార‌త్ కు నువ్వు ఆడినప్పుడు ఏం సాధించావ్ ? అని నిలదీస్తున్నారు. కాగా ముంబై వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా 38 బంతుల్లో 50 పరుగులు సాధించాడు కోహ్లీ.

Next Story