- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL: చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం.. కళ్లు చెదిరే ధరకు కొనుగోలు
ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ కుటుంబం, అదర్ పూనావాలా సుమారు రూ. 15,600 కోట్లకు కొనుగోలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఓల్డ్ అండ్ క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ (RR) యాజమాన్యం మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్.మిట్టల్ కుటుంబంతో పాటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా సంయుక్తంగా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. మనోజ్ బడాలే నేతృత్వంలోని కన్సార్టియం నుంచి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు మిట్టల్ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. ఈ డీల్ విలువ అక్షరాలా 1.65 బిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు రూ. 15,600 కోట్లు) కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ డీల్స్‌లో ఒకటిగా నిలవనుంది.
సోమానీ డీల్ రద్దుతో మారిన సమీకరణాలు:
నిజానికి రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేయడానికి అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ముందుకొచ్చింది. వీరు 1.63 బిలియన్ డాలర్లకు బిడ్ దాఖలు చేశారు. అయితే, నిధుల సేకరణలో (Funding issues) సమస్యలు తలెత్తడం, డ్యూ డిలిజెన్స్ (due diligence) ప్రక్రియలో పలు సమస్యల కారణంగా ఈ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కల్ సోమానీ రేసు నుండి తప్పుకోవడంతో మిట్టల్ కుటుంబం రంగంలోకి దిగింది. వీరికి తోడుగా అదర్ పూనావాలా కూడా భాగస్వామిగా మారి ఈ టీమ్ ను తమ సొంతం చేసుకున్నారు.
కొత్త యాజమాన్య స్వరూపం ఇదే:
మిట్టల్ కుటుంబం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ప్రస్తుత యజమాని మనోజ్ బదాలే అండ్ కన్సార్టియం నుండి జట్టును కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జస్థాన్ రాయల్స్‌లో టీమ్‍లో మిట్టల్ ఫ్యామిలీకి సుమారు 75 శాతం మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది. సుమారు 18 శాతం వాటాను అదర్ పూనావాలా కలిగి ఉంటారు. మరో 7 శాతం వాటా పాత పెట్టుబడిదారులైన మనోజ్ బదాలేతో సహా ప్రస్తుతం ఉన్న కొందరు ఆమోదిత పెట్టుబడిదారుల చేతిలో ఉంటుంది.
ఆర్ఆర్ ఇతర జట్లు కూడా:
రూ.15,600 కోట్ల డీల్‌లో కేవలం ఐపీఎల్ పురుషుల జట్టు మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలోని ఇతర జట్లు కూడా ఇందులో భాగమేని స్పష్టం చేశారు. రాజస్థాన్ రాయల్స్ (IPL ఫ్రాంచైజీ), పార్ల్ రాయల్స్ (దక్షిణాఫ్రికా T20 లీగ్), బార్బడోస్ రాయల్స్ (కరీబియన్ ప్రీమియర్ లీగ్) ఈ డీల్ లో భాగమే అని తెలిపారు. యాజమాన్య మార్పు తర్వాత రాజస్థాన్ రాయల్స్ పునర్వ్యవస్థీకరించబడిన బోర్డులో లక్ష్మీ ఎన్. మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్-భాటియా, అదర్ పూనావాలా, మనోజ్ బదాలే ఉండనున్నారు. మనోజ్ బదాలే బోర్డులో కొనసాగుతూ, క్రికెట్‌పై తనకున్న లోతైన జ్ఞానం, అనుభవంతో ఫ్రాంచైజీకి, కొత్త యాజమాన్యానికి మధ్య వారధిగా పనిచేస్తారని ప్రకటనలో తెలిపారు. ఈ భారీ ఒప్పందం 2026 మూడవ త్రైమాసికం నాటికి ముగిసే అవకాశం ఉంది. ఈ డీల్ బీసీసీఐ (BCCI), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదానికి లోబడి ఉంటుంది.






