- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: ఫ్యాన్స్ కు షాక్..ఆర్సీబీ టికెట్ల అమ్మకాల్లో గోల్‌మాల్
ఐపీఎల్ 2026 లో బ్లాక్ టికెట్ల దందా తెరపైకి వచ్చింది. ఈ సీజన్ టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో బ్లాక్ టికెట్ల దందా తెరపైకి వచ్చింది. ఈ సీజన్ టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ ఏకంగా 181 టికెట్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్ టికెట్లను ఒక్కోటి రూ.15 వేల నుంచి రూ.19 వేల వరకు బ్లాక్ లో అమ్మేశాడు. అయితే ఇందులో సగం టికెట్లు సేల్ కాగా.. మరికొన్ని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ టికెట్లు ఈ నెల 15వ తేదీన జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో మ్యాచ్ కు సంబంధించినవి కావడం గమనార్హం. కర్ణాటక స్టేట్ క్రికెట్ అకాడమీ మెంబెర్ గణేష్ పరీక్షిత్ తనకు టికెట్లు ఇచ్చి అధిక ధరలకు అమ్మాలని చెప్పినట్లు క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రస్తుతం గణేష్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇంకా ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్న వదిలేది లేదని కర్ణాటక పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ టికెట్ల దందాకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పమని వార్నింగ్ ఇస్తున్నారు.






