'హర్బజన్ చేరికతో జట్టులో స్పిన్ బలం పెరిగింది'

by  |
హర్బజన్ చేరికతో జట్టులో స్పిన్ బలం పెరిగింది
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సీనియర్ క్రికెటర్ హర్బజన్ సింగ్ చేరికతో స్పిన్ బలం పెరిగిందని ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో కలసి ఇండియా పర్యటనకు వచ్చిన మోర్గాన్.. తొలి వన్డేలో గాయపడి మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నాడని.. గత వారం కంటే ప్రస్తుతం గాయం తీవ్రత తగ్గిందని మోర్గాన్ వెల్లడించాడు. వన్డే సిరీస్, ఐపీఎల్ మధ్య వచ్చిన విరామం వల్ల పూర్తిగా సన్నద్దం అవడానికి అవకాశం వచ్చిందని చెప్పాడు. ‘కేకేఆర్ బౌలింగ్ విభాగంలో హర్భజన్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో మంచి ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణ కూడా మా జట్టులో ఉన్నాడు. ఈ సారి తప్పకుండా కేకేఆర్ మంచి ప్రదర్శన చేస్తుంది’ అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed