అరుదైన ఘనత సాధించిన ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు

by  |
అరుదైన ఘనత సాధించిన ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి-బి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాశెట్టి ప్రమోద్ రాంకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో నిర్వహించనున్న వెబినార్ శిక్షణా సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ నెల 31తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు వరుసగా అయిదు రోజుల పాటు నిర్వహించే ఈ అంతర్జాల వెబినార్‌లో దేశవ్యాప్తంగా ఎంపికచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, వాటి అనువర్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణం, శీతోష్ణస్థితులపై అధ్యయనం తదితర అంశాలపై శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఇస్రో శిక్షణ సంస్థ నిర్వాహకులు, ముఖ్య శాస్త్రవేత్త డా.హరీశ్ చంద్ర ఆహ్వానాన్ని మెయిల్ ద్వారా పంపించారు. ప్రమోద్ రాం ప్రస్తుతం మామడ మండలంలోని పరిమండల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇస్రో శిక్షణా సదస్సుకు ఎంపిక కావడం పట్ల ఆయనను పలువురు అభినందించారు.



Next Story

Most Viewed