- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఎమ్మెల్యే అక్రమ సంపాదనపై విచారణ జరిపించండి
by Shyam |
<p>దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అక్రమ సంపాదనపై విచారణ జరిపించాలని టీపీసీపీ మెంబర్ డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తమ కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నారాయణఖేడ్‌లో తమకున్న పది ఎకరాల భూమిలో మంచినీటి సరఫరా ట్యాంకుకు, ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి సైతం మూడెకరాల భూమిని ప్రభుత్వానికి విక్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అవినీతి అక్రమాలను బయటపెడతామనే తమపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని […]</p>

X
దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అక్రమ సంపాదనపై విచారణ జరిపించాలని టీపీసీపీ మెంబర్ డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తమ కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
నారాయణఖేడ్‌లో తమకున్న పది ఎకరాల భూమిలో మంచినీటి సరఫరా ట్యాంకుకు, ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి సైతం మూడెకరాల భూమిని ప్రభుత్వానికి విక్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అవినీతి అక్రమాలను బయటపెడతామనే తమపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని సంజీవరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే తన కుమారుడి పేరుతో సెటిల్మెంట్లు చేస్తూ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు.
Next Story






