చూడాలని ఉంది సిద్దార్థ్ : కియార

by  |
చూడాలని ఉంది సిద్దార్థ్ : కియార
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా.. మరోసారి ఫిల్మ్ న్యూస్ హెడ్ లైన్స్‌లో నిలిచారు. కియార సోమవారం రిలీజైన తన లేటెస్ట్ మూవీ ‘ఇందూ కీ జవాని’ ట్రైలర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేయగా, దీనిపై స్పందించాడు సిద్దార్థ్. ఘజియాబాద్‌కు చెందిన ఇందు హాట్‌గా ఉందన్న హీరో.. డిసెంబర్ 11న మిమ్మల్ని చూసేందుకు వస్తుందని సినిమా రిలీజ్ డేట్ చెప్పాడు.

https://twitter.com/advani_kiara/status/1331086841718587394?s=20

దీనిపై రిప్లయ్ ఇచ్చిన కియార.. ఇందు నిన్ను కూడా చూడాలని ఎదురుచూస్తోందని తెలిపింది. కాగా ఈ కన్వర్జేషన్‌తో నెటిజన్లు కథలు అల్లేస్తుండటం విశేషం. ‘షేర్షా’ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీని మళ్లీ రిపీట్ చేస్తే చూడాలని ఉందని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా కియార, సిద్దార్థ్ సోషల్ మీడియా చాట్స్.. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న డౌట్స్ రైజ్ చేయగా, ఇప్పుడు మరోసారి అదే డౌట్ క్రియేట్ చేస్తున్నారు. చాలా సార్లు జంటగా కూడా కనిపించిన ఈ బీటౌన్ ప్రేమ పక్షులు.. తమ మధ్య రిలేషన్ ఉందని మాత్రం ఒప్పుకోవడం లేదు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కియార తను సింగిల్‌గానే ఉన్నానని చెప్పిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed