రజినీ ఫిట్‌నెస్‌కు ఆశ్చర్యపోయిన బేర్ గ్రిల్స్

by  |
రజినీ ఫిట్‌నెస్‌కు ఆశ్చర్యపోయిన బేర్ గ్రిల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీ కాంత్… స్టైల్ ఐకాన్. యూనిక్ యాక్టింగ్‌తో దేశ, విదేశాల్లో ఫ్యాన్స్ సంపాదించుకున్న తలైవా… రాజకీయాల్లోనూ అరంగేట్రం చేయబోతున్నారు. కానీ అంతకు ముందుగా ఓ వైల్డ్ అడ్వెంచర్ చేసేశారు రజినీ. డిస్కవరీ ఛానల్‌లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో’ హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు. కర్ణాటకలోని బందీపూర్ అడవుల్లో షూటింగ్ జరగ్గా… “ఇంటు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అండ్ సూపర్ స్టార్” గా డిస్కవరీ ఛానల్‌లో మార్చి 23న రా. 8 గంటలకు షో ప్రసారం కానుంది.

కాగా తలైవా ఆన్ డిస్కవరీ… హ్యాష్ ట్యాగ్ గత నెలరోజులుగా ట్రెండింగ్‌లో ఉంటోంది. రజినీ ఫేమ్‌ను క్యాష్ చేసుకుంటూ… తన పేరు మీద ఓ పాటనే విడుదల చేసిన డిస్కవరీ ఛానల్.. షో రేటింగ్ పెంచేందుకు.. షో జనాల్లోకి వెళ్లేందుకు డ్యాన్స్ చాలెంజ్ కూడా విసిరింది ఈ మధ్య. దీనికి భారీ రెస్పాన్స్ రాగా… షో ప్రసారం అయ్యేందుకు మరో మూడు రోజులే సమయం ఉండడంతో మరో ప్రోమో విడుదల చేసింది. ప్రోమోలో బేర్ గ్రిల్స్, రజినీల మధ్య నీటి గురించి టాపిక్ రాగా… విశ్వాన్ని నడిపించేదే నీరని.. అది లేకపోతే మానవాళి లేదని వివరించారు రజినీ. కానీ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో నీరు కూడా ఒకటన్నారు. ఆ తర్వాత మీరు 18 ఏళ్ల వయస్సులో ఏం చేశారన్న బేర్ గ్రిల్స్ ప్రశ్నకు…. ఆ టైంలో నేను కండక్టర్‌గా పనిచేశానని.. డైరెక్టర్ కె. బాలచందర్ తనకు యాక్టర్‌గా ఇచ్చిగా స్టార్‌గా మార్చారని తెలిపారు. తర్వాత అడవిలో నీటికోసం ఇద్దరు చేసే ప్రయత్నాల్లో భాగంగా రజినీ చేసిన అడ్వెంచర్స్‌కు బేర్ గ్రిల్స్ ఆశ్చర్యపోయారు. 70 ఏళ్లలో ఇంత ఫిట్‌నెస్‌తో ఉన్నారా? .. నిజంగా మీరు ఒక స్ఫూర్తి అని.. మీ నుంచి చాలా నేర్చుకోవాలన్నారు బేర్ గ్రిల్స్. ప్రోమోలో బేర్ గ్రిల్స్ .. రజినీ షూ లేస్ కట్టడం హైలెట్‌ కాగా.. ఈ విషయంలో బేర్ గ్రిల్స్‌ను అభినందిస్తున్నారు నెటిజన్లు.

Tags : Thalaiva On Discovery, Rajinikanth, Bear Grylls, Promo, Into The Wild With Bear Grylls



Next Story

Most Viewed