అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

54

దిశ,వెబ్‌డెస్క్: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు సంబంధించి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వారి దగ్గర నుంచి 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు గంజాయిని ముఠా సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. గంజాయిని ముఠా సభ్యులు వైజాగ్‌లో కొనుగోలు చేసి జవహర్ నగర్‌లో డంప్ చేస్తున్నట్టు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..