ప్రతీ మహిళను అలా భావించినప్పుడే నేరాలు తగ్గుతాయి : సీఐ ఆదిరెడ్డి

by Sridhar Babu |
ప్రతీ మహిళను అలా భావించినప్పుడే నేరాలు తగ్గుతాయి : సీఐ ఆదిరెడ్డి
X

దిశ, అచ్చంపేట : ప్రతి మహిళలను అమ్మగా, సోదరిగా భావించినప్పుడు సమాజంలో స్త్రీలపై జరుగుతున్న నేరాలు తగ్గుతాయని అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి అన్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏరియా టీమ్ లీడర్ సరస్వతి ఆధ్వర్యంలో గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గ్రామ సమీపంలో గల గిరిజన భవనం వద్ద ‘అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం’ సందర్భంగా ఆదివాసీ గిరిజనులకు అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి చిగుర్ల బుచ్చమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీఐ ఆదిరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సమాజంలో మనిషి మనిషిగా మారాలని అలా జరిగినప్పుడు హింస తగ్గుతాయన్నారు. ముఖ్యంగా స్త్రీలపై అఘాయిత్యాలు, ఘోరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి స్త్రీ స్వశక్తి పై నిలబడాలి..

ప్రతి మహిళ స్వశక్తి పై నిలబడినప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని అమ్రాబాద్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి తెలిపారు. పురుషులందరూ చెడ్డవారు కాదని సమాజంలో 1 శాతం మాత్రమే మగవారు స్త్రీల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రతీ పురుషుడు అమ్మను పూజించాలి, భార్యను ప్రేమించాలి, సోదరిని దీవించే.. స్వభావం కలిగి మొత్తంగా స్త్రీని గౌరవించినప్పుడే ఈ సమాజంలో మహిళలు గౌరవంగా బతుకుతారని, భద్రత కూడా ఉంటుందన్నారు. ముఖ్యంగా మహిళలు చదువు పట్ల ఆసక్తి చూపాలని, తల్లిదండ్రులు అమ్మాయిలను తప్పక బడికి పంపించాలన్నారు. చదువుతూనే నమస్కారం, గౌరవం, తదనంతరం స్వశక్తి పై నిలబడతారని అప్పుడే ధైర్యం, శక్తి ఉంటుందన్నారు. ఎక్కడైనా ఒక స్త్రీకి అన్యాయం జరిగితే స్త్రీ లోకమంతా ముక్తకంఠంతో పోరాటం చేయాలని అప్పుడే అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. అలాగే అజ్ఞానంతో బాల్య వివాహాలు చేయరాదని, తల్లిదండ్రులు మగ పిల్లవాడి బాల్యం నుండి ఏమి ఆశిస్తారో.. బాలికల నుంచి కూడా అదే ఆశించాలని..అప్పుడే తారతమ్యాలు తొలగిపోతాయన్నారు.అంతకుముందు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో నిమ్మల గురువమ్మ, డాక్టర్లు సైఫుల్లా ఖాన్, సింగన్న, ఆదివాసీ గిరిజనులు, సంస్థ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story