కరోనా ఇప్పట్లో పోయేలా లేదు

by  |
కరోనా ఇప్పట్లో పోయేలా లేదు
X

దిశ, న్యూస్ బ్యూరో: “రాష్ట్రంలో కరోనా వైరస్ ఇప్పట్లో పోయేలా లేదు. ఇంకా కొన్ని నెలల పాటు ఉండే అవకాశమే ఉంది. ఇప్పటికి మందు లేదు, వ్యాక్సిన్ రాలేదు. ఎంతకాలం కరోనా బాధలుంటాయో ఎవ్వరికీ తెలియదు. ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్పందించాలి.” అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నొక్కిచెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన కార్యవర్గ సమావేశం సందర్భంగా కేటీఆర్ పై విధంగా వ్యాఖ్యానించారు. విపక్షాల విషయంలో టీఆర్ఎస్ విధానం ప్రకారం కార్యకర్తలు, నేతలు నడుచుకోవాలని, రాజీ పడొద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా ఎదురుదాడి చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ రక్షణ కవచంగా ఉండేది ఈ పార్టీ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. జల దృశ్యం వేదికగా 2001 జూలైలో పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్ మంచి లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, ఆ మూహుర్తం చాలా బలమైనది కాబట్టే వంద సంవత్సరాలైనా పార్టీ ఇలాగే ధృడండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో జల దృశ్యం నుంచి తమను రోడ్డు పైకి గెంటేసినా ముహూర్త బలం కారణంగానే ఇంతదూరం వచ్చినట్లు గుర్తుచేశారు. రోడ్డుపై పడిన పరిస్థితి నుంచి ఉవ్వెత్తున ఎగసి నేడు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ భవన్‌లో 60లక్షల మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగామని, ఇదంతా కార్యకర్తల కృషేనని అన్నారు. అన్నం తిన్నారో అటుకులు బుక్కారో కానీ ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదుర్కొని కార్యకర్తలు పార్టీని భుజాలపై మోసి ఇంత ఎత్తుకు ఎదిగించారని వారి కృషిని ప్రశంసించారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై దాదాపు పదమూడేళ్ళ పాటు అనేక కుట్రలు జరిగాయని అన్నారు. తెలంగాణ ప్రజల కళ్ళలో సంతోషం చూడటమే టీఆర్ఎస్ లక్ష్యమని, పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకం పెట్టిన తర్వాత ఇప్పటి వరకు రూ. 47 కోట్లను కట్టామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని పార్టీగా ఆవిర్భవించిందన్నారు.

కార్యకర్తల ఇండ్ల దగ్గరికే ఇన్సూరెన్స్ చెక్కుల్ని అందించామని, జిల్లాలో పార్టీ కార్యాలయాల భవనాలు దాదాపు పూర్తి కావచ్చాయని, కరోనా పరిస్థితుల కారణంగా శిక్షణా కార్యక్రమలను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. కరోనా సంక్షోభం పూర్తిగా పోయేవరకు ప్రజలకు అండగా ఉండాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు.

“రాష్ట్రంలో కరోనా వైరస్ ఇప్పట్లో పోయేలా లేదు. ఇంకా కొన్ని నెలల పాటు ఉండే అవకాశమే ఉంది. ఇప్పటికి మందు లేదు, వ్యాక్సిన్ రాలేదు. ఎంతకాలం కరోనా బాధలుంటాయో ఎవ్వరికీ తెలియదు. ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్పందించాలి… ” అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నొక్కిచెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన కార్యవర్గ సమావేశం సందర్భంగా కేటీఆర్ పై విధంగా వ్యాఖ్యానించారు. విపక్షాల విషయంలో టీఆర్ఎస్ విధానం ప్రకారం కార్యకర్తలు, నేతలు నడుచుకోవాలని, రాజీ పడొద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా ఎదురుదాడి చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ రక్షణ కవచంగా ఉండేది ఈ పార్టీ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. జల దృశ్యం వేదికగా 2001 జూలైలో పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్ మంచి లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, ఆ మూహుర్తం చాలా బలమైనది కాబట్టే వంద సంవత్సరాలైనా పార్టీ ఇలాగే ధృడండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో జల దృశ్యం నుంచి తమను రోడ్డు పైకి గెంటేసినా ముహూర్త బలం కారణంగానే ఇంతదూరం వచ్చినట్లు గుర్తుచేశారు. రోడ్డుపై పడిన పరిస్థితి నుంచి ఉవ్వెత్తున ఎగసి నేడు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ భవన్‌లో 60 లక్షల మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగామని, ఇదంతా కార్యకర్తల కృషేనని అన్నారు. అన్నం తిన్నారో అటుకులు బుక్కారో కానీ ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదుర్కొని కార్యకర్తలు పార్టీని భుజాలపై మోసి ఇంత ఎత్తుకు ఎదిగించారని వారి కృషిని ప్రశంసించారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై దాదాపు పదమూడేళ్ళ పాటు అనేక కుట్రలు జరిగాయని అన్నారు. తెలంగాణ ప్రజల కళ్ళలో సంతోషం చూడటమే టీఆర్ఎస్ లక్ష్యమని, పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకం పెట్టిన తర్వాత ఇప్పటి వరకు రూ. 47 కోట్లను కట్టామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని పార్టీగా ఆవిర్భవించిందన్నారు.

కార్యకర్తల ఇండ్ల దగ్గరికే ఇన్సూరెన్స్ చెక్కుల్ని అందించామని, జిల్లాలో పార్టీ కార్యాలయాల భవనాలు దాదాపు పూర్తి కావచ్చాయని, కరోనా పరిస్థితుల కారణంగా శిక్షణా కార్యక్రమలను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. కరోనా సంక్షోభం పూర్తిగా పోయేవరకు ప్రజలకు అండగా ఉండాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు.



Next Story

Most Viewed