ఇన్స్టా నిర్వాకం.. పరమ శివుడికే అవమానం

by  |
ఇన్స్టా నిర్వాకం.. పరమ శివుడికే అవమానం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయులు దేవుళ్లను ఎంత భక్తిగా కొలుస్తారో అందరికి తెలిసిందే. తమ దేవుళ్లను ఎవరైన కించపరిచినా, అవమానపరిచినా ఏ మాత్రం సహించరు. తాజాగా సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ హిందూ దేవుళ్లను కించపరిచి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఓ బీజేపీ నేత ఫిర్యాదు చేశాడు. ఢిల్లీకి చెందిన మనీష్ సింగ్ అనే బీజేపీ నేత ఇన్స్టాగ్రామ్ స్టిక్కర్ పరమ శివుడిని అవమానించేలా ఉందని ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నారు.

ఇన్స్టాలో జిఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఆ స్టిక్కర్ లో శివుడు.. ఒక చేతిలో వైన్ గ్లాస్.. మరో చేతిలో మొబైల్ పట్టుకొని ఉన్నాడు. ఈ- ప్లాట్‌ఫామ్‌లోని స్టోరీ సెక్షన్‌లో ఈ స్టిక్కర్ కనిపించడంతో.. హిందువుల మనో భావాలను దెబ్బ తీసేలా ఆ స్టిక్కర్ ఉందంటూ మనీష్ ఆరోపించారు. వెంటనే ఆ స్టిక్కర్ ని డిలీట్ చేయాలనీ ఆయన డిమాండ్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ సీఈవో, ఇతర అధికారులపై ఫిర్యాదు నమోదు చేశారు. హిందువులకు పరమ శివుడు అతి ప్రీతికరమైన దేవుడని, ఆయన చేతిలో మందు గ్లాస్, ఫోన్ పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను రెచ్చగొట్టి, విద్వేషాలు క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



Next Story