లైసెన్స్ లేకుండా ఫార్మసీ నిర్వహణ.. బాన్సువాడలో విస్తృతంగా తనిఖీలు

89
Inspection

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఔషథ నియంత్రశాఖ సహయ సంచాలకులు డా.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. బాన్సువాడ పట్ణణంలో ఇటీవల లైసెన్స్ లేని మందుల దుకాణాలు ఉన్నాయని, ఫార్మసిస్టు లేకుండా ఫార్మసీ నడుస్తున్నాయని, ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్ మందులు అమ్మకాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాటిపై ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఏడీ రాజ్యలక్ష్మి, కామారెడ్డి డ్రగ్ ఇన్స్‌పెక్టర్ శ్రీలత, నిజామాబాద్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌ల ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ పట్టణంలోని 13 మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి షాపులకు నోటీసులు ఇచ్చారు. ఔషధ నియంత్రణ శాఖాధికారులు తనిఖీకి వస్తున్నారని ముందే తెలిసి కొన్ని మెడికల్ షాపులు మూసివేయగా, శాంపిల్స్ అమ్మే దుకాణాల నిర్వహకులు అప్రమత్తమయ్యారు.