మోర్ క్రికెట్.. మోర్ డ్రామా.. త్వరలోనే ‘ఇన్‌సైడ్ ఎడ్జ్ 3’

by  |
మోర్ క్రికెట్.. మోర్ డ్రామా.. త్వరలోనే ‘ఇన్‌సైడ్ ఎడ్జ్ 3’
X

దిశ, సినిమా : ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల సీక్వెల్స్ హవా నడుస్తున్న నేపథ్యంలో మరో పాపులర్ సిరీస్‌‌ తెరపైకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌ తన పాపులర్ వెబ్ సిరీస్ ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’కు నెక్ట్స్ సీజన్స్ ప్రకటించింది. క్రికెట్ ఆధారంగా తెరకెక్కిన మొదటి రెండు సీజన్లలో నటించిన ‘రిచా చద్దా, వివేక్ ఒబెరాయ్, సయానీ గుప్తా, తనూజ విర్వాని.. మూడో సీజన్‌లోనూ అవే పాత్రలు పోషించనున్నారు. ఈ మేరకు ‘మోర్ క్రికెట్, మోర్ డ్రామా, మోర్ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో పోస్టర్ రిలీజ్ చేసిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. సీజన్‌3 త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని అప్‌డేట్ ఇచ్చింది. స్పాట్ ఫిక్సింగ్, డోపింగ్, ఇతరత్రా విషయాలతో ముడిపడి ఉన్న బిజినెస్ గేమ్‌లో ఆధిపత్యం కోసం పోరాడుతున్న ముంబై మావరిక్స్ క్రికెట్ టీమ్, దాని యజమాని జరీనా మాలిక్ చుట్టే ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంటుంది.

రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించిన ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’కు కరణ్ అన్షుమన్ రచయిత కాగా.. థర్డ్ సీజన్‌కు కన్షిక్ వర్మ డైరెక్ట్ చేయనున్నారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్, ఇల్లీగల్ బెట్టింగ్ ఆరోపణలతో ‘ముంబై మావరిక్స్’ టీమ్‌‌‌‌పై ఆరోపణలు చుట్టుముట్టడంతో రెండు సంవత్సరాల పాటు పీపీఎల్‌‌లో ఆడకుండా బ్యాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరగనుందనే ఎగ్జైటింగ్ సస్పెన్స్‌తో సీజన్ 2 ముగిసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed