- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్.ఎఫ్.సీ.ఎల్ ఉద్యోగాలలో వెలుగు చూస్తున్న కుంభకోణాలు..
<p>దిశ, గోదావరిఖని: ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థలో ఉద్యోగాల నియామకాల్లో ఒక్కో ఉద్యోగానికి లక్షల రూపాయలను దండుకున్నట్లు ఆరోపణలు రావడంతో దీనిపై సెంట్రల్ విజిలెన్స్ అధికారులు గత మూడు రోజులుగా విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థలో కొంతమందిని పిలిచి విచారణ చేసి వారిని విధుల్లో నుండి పక్కకు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే విధుల నుండి పక్కకు పెట్టిన సుమారు 30 మంది దగ్గర ఎవరెవరు ఎంత తీసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి బయట […]</p>

దిశ, గోదావరిఖని: ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థలో ఉద్యోగాల నియామకాల్లో ఒక్కో ఉద్యోగానికి లక్షల రూపాయలను దండుకున్నట్లు ఆరోపణలు రావడంతో దీనిపై సెంట్రల్ విజిలెన్స్ అధికారులు గత మూడు రోజులుగా విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థలో కొంతమందిని పిలిచి విచారణ చేసి వారిని విధుల్లో నుండి పక్కకు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే విధుల నుండి పక్కకు పెట్టిన సుమారు 30 మంది దగ్గర ఎవరెవరు ఎంత తీసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి బయట ఎంత వసూలు చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు అనేదానిపై సెంట్రల్ విజిలెన్స్ అధికారులు విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయట పడుతుండడంతో ఆశ్చర్యానికి గురౌతున్నట్లు తెలుస్తోంది.
లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొంత మందికి అవకాశం..
ఆర్ఎఫ్సీఎల్‌లో విచారణ చేపడుతున్న సెంట్రల్ విజిలెన్స్ అధికారులు కొంతమందిని విధుల్లో నుండి తొలగించి సుమారు 30 మంది కొత్తవారిని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారిని విధుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతరుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ చేపడుతున్నట్లు సమాచారం.






